ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్.. రాజ భవనాల్లో విలాస జీవితం గడిపితే... పేద ప్రజలు మాత్రం కూలిపోయే ఇందిరమ్మ ఇళ్లలో నివసించాలా అని లోకేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పాండ్ మింగి లోటస్ వంటి భారీ భవనాన్ని నిర్మించుకున్న జగన్... ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం తప్పుపట్టడం సబబు కాదన్నారు. జగన్ సరదాగా గడపటానికి బెంగళూరులో ప్యాలెస్ నిర్మించుకున్నారని ట్విట్టర్లో విమర్శించారు.
"విలాస జీవికి పేదల కష్టాలెలా తెలుస్తాయి" - jagan in twitter
రాజ భవంతుల్లో విలాసవంతంగా గడిపే జగన్కు... పేదవాని కష్టాలెలా తెలుస్తాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. కూలీపోయే ఇందిరమ్మ గృహాల కన్నా అన్ని సౌకర్యాలు ఉన్న ఎన్టీఆర్ ఇళ్లు ఎంతో మేలని ట్వీట్ చేశారు.
పాండ్ మింగి లోటస్ కట్టిన జగన్ పేదవాని కష్టాలు తెలుసా : లోకేశ్