ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కొందరు వైకాపా నేతలు ముస్లిం మహిళని వేధిస్తున్న తీరు రాష్ట్రంలో రాక్షసరాజ్యాన్ని తలపిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. 'రాయచోటిలో అంగన్‌వాడీ కార్యకర్తను తొలగించి... అనుకూలంగా ఉన్నవాళ్లని నియమించుకునేందుకు "వైకాపా రౌడీలు... ఏకంగా అంగన్‌వాడీ స్కూల్‌నే కాల్చేశారు" అని లోకేశ్ ఆరోపించారు. అంగన్‌వాడీ ఉద్యోగమే ఆధారంగా బతుకుతున్న భర్తలేని ఆ ముస్లిం మహిళా ఉద్యోగం తొలగించారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెపైనే తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. నలుగురు పిల్లలతో ఒంటరి మహిళని నడిరోడ్డున పడేయడమేనా జగన్ రెడ్డి మహిళలకు ఇచ్చే భరోసా అని నిలదీశారు. మహిళ ఆవేదన వీడియోను లోకేశ్ తన ట్విట్టర్‌కు జత చేశారు.
'వైకాపా రౌడీలు.. ఏకంగా అంగన్‌వాడీ స్కూల్‌నే కాల్చేశారు' - lokesh latest news
'సీఎం జగన్ సొంత జిల్లాలో కొందరు వైకాపా రౌడీలు.. ఏకంగా అంగన్‌వాడీ స్కూల్‌నే కాల్చేశారు' అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాయచోటిలో అంగన్‌వాడీ ఉద్యోగమే ఆధారంగా బతుకుతున్న భర్తలేని ఆ ముస్లిం మహిళా ఉద్యోగం తొలగించారని మండిపడ్డారు.

ట్వీట్టర్ లో స్పందించిన లోకేశ్