ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lokesh Fire On CM Jagan : జైల్లో పెట్టినా కక్ష తీరలేదా..! చంద్రబాబు లేఖ అంటే ఎందుకు భయం? : లోకేశ్

Lokesh Fire On CM Jagan : రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడును నాలుగు గోడల మధ్య నిర్బంధించినా జగన్ కి కక్ష తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి చంద్రబాబుకు లేఖ రాసే హక్కు కూడా లేదంటూ వేధిస్తున్నారని మండిపడ్డారు.

lokesh_fire_on_cm_jagan
lokesh_fire_on_cm_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 10:33 PM IST

Updated : Oct 23, 2023, 6:14 AM IST

Lokesh Fire On CM Jagan : జగన్ జమానాలో లేఖ రాయడం కూడా దేశ ద్రోహమా అని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. చెయ్యని తప్పుకి 44 రోజులుగా జైలులో బందీగా ఉన్న చంద్రబాబు... ములాఖత్ లో భాగంగా ఆయన ప్రజలతో చెప్పాలనుకున్న అంశాలు అన్నీ తమతో పంచుకున్నారని తెలిపారు. వాటిని లేఖ రూపంలో బయటపెడితే ఎందుకు భయపడుతున్నారని లోకేశ్ నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా పెన్ కెమెరాతో వీడియోలు తీసి ఇచ్చినప్పుడు అధికారులకు జైలు నిబంధనలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్యాలెస్ ఆదేశాలకు భయపడి లేఖ రాయడం కూడా నేరం అన్నట్టు పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేయడం రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తలపిస్తోందని ధ్వజమెత్తారు. నాలుగు గోడల మధ్య నిర్బంధించినా జగన్ కి కక్ష తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి చంద్రబాబుకు లేఖ రాసే హక్కు కూడా లేదంటూ వేధిస్తున్నారని మండిపడ్డారు.

Chandrababu letter to Telugu people : నేను జైలులో లేను.. ప్రజల హృద‌యాల్లో ఉన్నా: చంద్రబాబు

ఆనంద్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. ప్రచారానికి వేల‌కోట్లు త‌గ‌లేస్తూ, జ‌గ‌న‌న్న సుర‌క్ష అని డ‌బ్బా కొట్టుకుంటూ... ఆస్పత్రిలో క‌నీస వైద్యస‌దుపాయాలు క‌ల్పించ‌ని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. సైకో జ‌గ‌న్ విధ్వంస పాల‌న‌లో ఆస్పత్రికి చేరేందుకు వెళ్లే రోడ్లు గుంత‌ల‌మ‌య‌మై ప్రాణాలు తీసిన దారుణ ఘటన వైద్యారోగ్య శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ సొంత జిల్లాలో జ‌రిగిందని దుయ్యబట్టారు. ప‌ల్నాడు జిల్లా కారంపూడి ప‌ట్టణానికి చెందిన బ‌త్తిన ఆనంద్ భార్య రామాంజమ్మకి పురిటినొప్పులు రావ‌డంతో స్థానిక పీహెచ్సీకి తీసుకెళితే, సౌక‌ర్యాలు లేవ‌ని వైద్యులు చెప్పగా గుర‌జాల ఆస్పత్రికి త‌ర‌లించారని... అక్కడి వైద్యులూ వైద్యం చేయ‌లేమ‌ని చెప్పడంతో న‌ర‌స‌రావుపేట త‌ర‌లించారన్నారు. బైక్‌పై ఇంటికెళ్లి వైద్య ఖ‌ర్చులకు డ‌బ్బులు తెస్తూ జూల‌క‌ల్లు వ‌ద్ద రోడ్డు గుంత‌ల్లో ప‌డి ఆనంద్ తీవ్రంగా గాయ‌ప‌డి... భార్యని ప్రస‌వానికి చేర్చిన న‌ర‌స‌రావుపేట ఆస్పత్రిలోనే ప్రాణాలు వ‌దిలాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంద్ రోడ్డు ప్రమాదంలో చ‌నిపోలేదని... జ‌గ‌నాసురుడి విధ్వంస పాల‌నే అతనిని బ‌లి తీసుకుందని మండిపడ్డారు. ఇది స‌ర్కారీ హ‌త్యే అని ధ్వజమెత్తారు.

Nara Lokesh on Psycho Jaganasura: 'దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం - మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం'

రైతు సమస్యలపై సమీక్ష... రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో సాగునీటి కష్టాలు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సీజన్ లో వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని... అయితే సాగు చేసిన పంటలు కూడా వర్షభావం కారణంగా నేడు నీరందక ఎండిపోతున్నాయని తెలుగు దేశం పార్టీ నేతలు లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో లోకేశ్ నిన్న జరిపిన సమావేశంలో, స్ట్రాటజీ కమిటీ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించామన్నారు. జిల్లాల వారీగా పంటలు దెబ్బతిన్న పరిస్థితి, రైతుల దీన స్థితిని నేతలు లోకేశ్​కు వివరించారు.

Minister Ambati on Bhuvaneshwari Yatra సానుభూతి కోసమే నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర : మంత్రి అంబటి

Last Updated : Oct 23, 2023, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details