ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు శిరోముండనం చేశారని.. తనకు న్యాయం చేయాలని రాష్ట్రపతికి ఎస్సీ యువకుడు లేఖ రాశారు. తోటి ఎస్సీకి న్యాయం చేయాల్సింది పోయి.. మంత్రే నక్సలైట్లలో చేరాలనడం రాజారెడ్డి రాజ్యాంగం అమలుకి ప్రత్యక్ష నిదర్శనమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
సాయం చేయకపోగా మంత్రే నక్సలైట్లలో చేరాలనడం దారుణం: లోకేశ్ - nara lokesh on minister
వైకాపా మంత్రిపై..తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. సాటి ఎస్సీకి న్యాయం చేయాల్సింది పోయి.. మంత్రే నక్సలైట్లలో చేరాలనడం రాజారెడ్డి రాజ్యాంగం అమలుకి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు.

lokesh comments