ముఖ్యమంత్రి జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక పక్క కరోనా, మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. వాటిని జగన్ గాలి కొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబం పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకుల పై కరోనా కేసులు పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయేంతా స్థితికి వచ్చారంటే... ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ పై రిలీజైన 24 గంటల్లోనే భౌతిక దూరం అంటూ మళ్లీ అరెస్ట్ చేయగా... ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరమన్నారు. జేసికి కరోనా సోకడానికి .. సీఎం నేర మనస్తత్వమే కారణమని ఆరోపించారు. కడప జైలు లో 317 మందికి కరోనా బారిన పడ్డారని... తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు.
'జేసీకి కరోనా సోకడానికి .. సీఎం నేర మనస్తత్వమే కారణం'
సీఎం జగన్ ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదని.. రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమేనని తెదేపా నేత నారా లోకేష్ విమర్శించారు. ఒక పక్క కరోనా, మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. వాటిని జగన్ గాలికొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు.
తెదేపా నేత నారా లోకేష్
ఇదీ చూడండి.24 గంటల్లో 150 టీఎంసీలు కడలిపాలు