ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రాణాలుకోల్పోతున్నారు: లోకేశ్ - ఏపీలో కరోనా కేసులు

జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో పడి.. కరోనా వ్యాప్తిపై దృష్టి పెట్టకపోవడం వల్లే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

lokesh comments
lokesh comments

By

Published : Jul 28, 2020, 4:13 AM IST

కరోనాపై యుద్దానికి కావాల్సిన సన్నద్ధత కోసం లాక్ డౌన్ సమయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటే.. జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు, ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టుల్లో బిజీగా ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. దాని పర్యవసానమే ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు వదలడం, రోడ్ల మీద చనిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. క్వారంటైన్ సెంటర్లలో అధ్వానమైన వసతులు, పీపీఈ కిట్లు లేవంటూ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆందోళనకి దిగిన ఘటనలను లోకేశ్ గుర్తుచేశారు. గంటకో సంఘటన వెలుగు చూస్తున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం ఘోరమని మండిపడ్డారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో ఓ మహిళ మృతి చెందితే.. ఆ మృతదేహాన్ని ఆస్పత్రి బెడ్ మీదే కొన్ని గంటల పాటు వదిలేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details