Lokesh comments Job Calender: ప్రతీ ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి.. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ఏళ్ళు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వారంలో రద్దు చేస్తానన్న సీపీఎస్ 150 వారాలైనా రద్దు చేయనట్టే.. అవుట్ సోర్సింగ్ వాళ్లకి ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ గాలికి ఎగిరిపోయిందని మండిపడ్డారు. రెగ్యులర్ చేస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఎదురుచూస్తున్న రెండున్నర లక్షల మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధిపైనే జగన్ వేటు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలోపు సర్వీసు వున్నవారందరినీ ఇంటికి సాగనంపుతున్న జగన్ని జనం ఎందుకు నమ్మాలని నిలదీశారు.
జగన్ని జనం ఎందుకు నమ్మాలి: నారా లోకేశ్ - కృష్ణ జిల్లా తాజా వార్తలు
Lokesh comments Job Calender: ప్రతీ ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ఏళ్ళు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. పదేళ్లలోపు సర్వీసు వున్న వారందరినీ ఇంటికి సాగనంపుతున్న జగన్ని జనం ఎందుకు నమ్మాలని నిలదీశారు.
నారా లోకేశ్