ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా నారా లోకేశ్ జన్మదిన వేడుకలు - విజయనగరం జిల్లాలో నారా లోకేశ్ బర్త్​డే వేడుకలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకలను విజయవాడ సెంట్రల్​, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్​ కట్​చేసి సంబరాలు చేసుకున్నారు.

ఘనంగా  నారాలోకేశ్ జన్మదిన వేడుకలు
ఘనంగా నారా లోకేశ్ జన్మదిన వేడుకలు

By

Published : Jan 23, 2020, 5:01 PM IST

విజయవాడలో నారా లోకేశ్ జన్మదిన వేడుకలు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ జన్మదిన వేడుకలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేతలు పట్టాభి, గొట్టిపాటి రఘు ఆధ్వర్యంలో భారీ కేక్​ కట్ చేశారు. లోకేశ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులు, మహిళలకు పండ్లు పంపిణీ చేశారు.

చీపురుపల్లి నియోజకవర్గంలో నారాలోకేశ్ జన్మదిన వేడుకలు

చీపురుపల్లిలో...
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో లోకేశ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. చీపురుపల్లి తెదేపా ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details