విజయవాడలో దీక్ష చేస్తున్న గద్దె రామ్మోహనరావుతో నారా లోకేశ్ దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ సీఎం జగన్పై ధ్వజమెత్తారు. అమరావతి శంకుస్థాపనకు జగన్మోహన్ రెడ్డి రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు తెలంగాణకు తరలిపోతున్నాయని ఆరోపించారు. రైతుల శాంతియుత ధర్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఐకాసకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
'రాష్ట్రం నుంచి కంపెనీలన్నీ తరలిపోతున్నాయి' - గద్దె రామ్మోహనరావు దీక్ష విరమింపజేసిన లోకేశ్
24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన గద్దె రామ్మోహనరావు చేత నారా లోకేశ్ దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['రాష్ట్రం నుంచి కంపెనీలన్నీ తరలిపోతున్నాయి' lokesh at gadde rammohan rao agitaiton](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5624176-444-5624176-1578385065945.jpg)
గద్దె రామ్మోహనరావు దీక్ష విరమింపజేసిన లోకేశ్