చల్లపల్లిలో కేవలం ప్రధాన రోడ్డు మినహాయించి అన్ని వీధుల ప్రధానద్వారం వద్ద ఇనుప రాడ్లతో గేట్లు ఏర్పాటు చేశారు. అనుసంధానంగా ఉన్న పది వీధులకు ఒక చెక్‌పోస్టు పెట్టి అక్కడ నుంచి మాత్రమే ప్రజల వారి ఇళ్లకు వెళుతున్నారు. అక్కడి స్థానికులు కూడా పోలీసులకు సహకరిస్తున్నారు. పనికిరాని సామన్లు, గ్రైండర్లు, కూలర్లు కూడా అడ్డుపెడుతున్నారు. చల్లపల్లి సీఐ వెంకటనారాయణ జరిమానాలు విధిస్తూ... ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలలో ఎప్పటికప్పుడు పర్వవేక్షణ చేస్తూ అనవసరంగా ప్రజలను రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలు, పోలీసుల సమన్వయంతో లాక్‌డౌన్ అమలు
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చల్లపల్లి గ్రామంలో లాక్‌డౌన్‌ను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రజలు, పోలీసులు ఒకరికొకరు సహకరించుకుంటూ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుచేస్తున్నారు.
చల్లపల్లిలో లాక్‌డౌన్