పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు. వస్త్ర దుకాణాలన్నీ వినియోగదారులతో కళకళలాడేవి. కానీ.. లాక్‌డౌన్ కారణంగా పెద్ద మాల్స్‌తో సహా చిన్న వస్త్ర దుకాణాలు సైతం మూతపడ్డాయి.
దాదాపు 3 నెలలుగా వ్యాపారాలు కుంటుపడిన కారణంగా.. అయోమయ పరిస్థితి నెలకొందని వ్యాపారస్థులు వాపోతున్నారు. వ్యాపార భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు.