ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మినహాయింపులు ఉన్నా.. 144 సెక్షన్​ అమల్లో ఉంటుంది' - కృష్ణాజిల్లాలో లాక్​డౌన్ మినహాయింపు

కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలకు లాక్​డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లా అంతటా 144 సెక్షన్ ఉంటుందని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కంటెయిన్​మెంట్​, రెడ్​జోన్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.

lock down
lock down

By

Published : May 4, 2020, 9:22 PM IST

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలననుసరించి కృష్ణా జిల్లాలో లాక్​డౌన్​ నుంచి కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లు కలెక్టర్​ ఇంతియాజ్​ తెలిపారు. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మెడికల్ క్లినిక్​లు, అవుట్ పేషెంట్ల విభాగానికి పూర్తిగా అనుమతించామని అన్నారు. కంటెయిన్​మెంట్, రెడ్​జోన్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవన్న కలెక్టర్.. జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రజలకు గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలకు జిల్లా వ్యాప్తంగా అనుమతిచ్చామని.. అలాగే పట్టణ ప్రాంతాలు, రెడ్​జోన్లలో అనుమతి ఉన్న మేరకే పరిశ్రమలు ప్రారంభించాలన్నారు.

ప్రైవేటు 33 శాతమే

ప్రైవేటు కార్యాలయాల్లో 33 శాతం ఉద్యోగులకు అనుమతినిచ్చామని.. అలాగే పట్టణ ప్రాంతాల్లో 33 శాతం కంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంటెయిన్​మెంట్ జోన్లలో ఉన్న వారు కాకుండా ..మిగిలిన వారు కార్యాలయాలకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. శానిటైజర్​తో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని కోరారు. సబ్బుతో వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఇవీ చదవండి:

తయారీ రంగ కార్యకలాపాలు రికార్డు స్థాయి పతనం

ABOUT THE AUTHOR

...view details