ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాటు.. మాడిన క్యాబేజీ పంట - lockdown effect on farmers

లాక్ డౌన్ ప్రభావం క్యాబేజీ రైతుపై పడింది. మార్కెటింగ్ సౌకర్యం లేక పొలంలోనే పంటను వదిలేశారు. సుమారు రూ.50 వేలు పెట్టుబడి పెడితే రూపాయి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

lock down effect on cabbage farmers
క్యాబేజీ రైతులపై కరోనా ప్రభావం

By

Published : Jun 1, 2020, 7:29 PM IST

క్యాబేజీ పంట రైతులకు కన్నీరు మిగిల్చింది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెంలో క్యాబేజీ సాగుచేసిన రైతులకు లాక్​డౌన్ వలన తీవ్ర నష్టం వాటిల్లింది. క్యాబేజీ కొనేవారు లేక... లాక్​డౌన్ ఎత్తివేస్తే కొనేవాళ్లు వస్తారని ఆశగా ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగింది. దారి లేక పంటను పొలంలోనే వదిలిపెట్టేశారు. చెమట చిందించి పండించిన పంట కళ్లెదురుగానే ఎండిపోయింది. చేసేది లేక పొలాన్ని దున్నేశారు.

ఎకరం పంటకు సుమారు రూ.50 వేల పెట్టుబడి అయ్యిందని.. కనీసం రూపాయి కూడా చేతికి రాలేదని రైతన్నలు వాపోతున్నారు. మార్కెటింగ్ అవకాశం కల్పించాలని మార్కెటింగ్ అధికారులను కోరినా చర్యలు తీసుకోలేదని రైతులు తెలిపారు. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'

ABOUT THE AUTHOR

...view details