వేసవి వచ్చిందంటే చాలు రోడ్లకు ఇరువైపులా మట్టి కుండలు దర్శనమిస్తాయి. లాక్ డౌన్ కారణంగా కుండలను కొనేవారు లేక... వాటిని తీసుకెళ్లేందుకు టోకు వర్తకులు రాకపోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. ప్రధానంగా మార్చి, ఏప్రిల్ , మే నెలల్లో జరిపే కుండల అమ్మకాలతోనే వారి ఏడాది జీవనం ఆధారపడి ఉంటుంది. వేరొక పని తెలియక కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్నామని.... తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజయవాడ సమీపంలోని తాడేపల్లి, కొత్తూరులో నివసించే కుమ్మరి వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
కుమ్మరి వృత్తిపై లాక్‌డౌన్ ప్రభావం..ఆదుకోవాలని విజ్ఞప్తి - కుమ్మరి వృత్తిపైనా లాక్‌డౌన్ ప్రభావం
కుమ్మరి వృత్తిపైనా లాక్‌డౌన్ ప్రభావం పడింది. కొనుగోలు చేసేవారు లేక కుండలు నిరుపయోగంగా పడివున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చేసే అమ్మకమే వారికి ఏడాది సంపద. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
lock-down