పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్పీసీడీసీఎస్ ఆయుష్ ప్రాజెక్టు కాలపరిమితి ఈనెల 31తో ముగియనుంది. జీవనశైలిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆనారోగ్య సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. కొవిడ్ సమస్యను ఎదుర్కొంటున్న ప్రస్తుత కాలంలో ఈ ప్రాజెక్టు సేవలను మరికొంత కాలం పెంచాలని రోగులు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు 500 మందికి మెరుగైన సేవలందిస్తున్న ఈ ప్రాజెక్టును ఆయుష్మాన్ భారత్లో చేర్చాలని అభిప్రాయపడుతున్నారు.
'ఆయుష్ ప్రాజెక్టు కాలపరిమితి పెంచండి' - AYUSH project in krishna district
ఎంతోమంది పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న ఎన్ సీడీసీఎస్ ఆయుష్ ప్రాజెక్టు కాలపరిమితిని పెంచాలని స్థానికులు కోరుతున్నారు. రోజుకు 500 మందికి సేవలందిస్తున్న ఈ ప్రాజెక్టు రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని...కొవిడ్ నేపథ్యంలో కాల పరిమితి పెంచేందకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

AYUSH project in krishna district