విద్యాసంస్థల మధ్య టోల్ గేటు నిర్మాణం పనులు నిలిపివేయాలని కృష్ణా జిల్లా మోపిదేవిలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరారు. జాతీయ రహదారిని ఆనుకొని మత్స్యకారుల బాలుర ఆశ్రమ పాఠశాల, మహాత్మాగాంధీ జ్యోతిబాపులే గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలల్లో సుమారు 2 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీటి మధ్య జాతీయ రహదారి సంస్థ టోల్గేటు నిర్మాణానికి స్థలాలు కొలతలు వేశారు. ఇక్కడ టోల్గోట్ నిర్మిస్తే.... శబ్ద, వాయు కాలుష్యం వలన అనేక శ్వాస కోశ వ్యాధులు వచ్చి విద్యార్థులు ఇబ్బందులు గురవుతారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
టోల్గేటు నిర్మాణం ఆపాలని స్థానికుల ఆందోళన - మోపిదేవి తాజా వార్తలు
మోపిదేవిలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న విద్యాసంస్థల్లో సుమారు 2 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటి మధ్య టోల్గేటు నిర్మాణానికి స్థలాలను అధికారులు కొలతలు వేశారు. ఇది గుర్తించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరారు.

టోల్గేటు నిర్మాణ స్థలాలకు కొలతలు వేస్తున్న అధికారులు