కృష్ణా జిల్లా కోడూరు మండల శివారు నరసింహపురం గ్రామంలో రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు గేదె నూతిలో పడిపోయింది. పెద్దగా అరుస్తూ ఉండటంతో స్థానికులు నిచ్చెన సహాయంతో బావిలోకి దిగి.. గేదె రెండు మోకాళ్లకు తాళ్లు కట్టారు.
స్థానికుంతా కలసి రెండు గంటలు శ్రమించి.. ఆ మూగజీవి ప్రాణాన్ని కాపాడారు. గతంలోనూ మూడు సార్లు గేదెలు బావిలో పడ్డాయని... నిరుపయోగంగా ఉన్న బావులను వెంటనే పూడ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అన్నారు.