ఉల్లిపాయల ధరలు రోజురోజుకి పెరుగిపోతూనే ఉన్నాయి, ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కేజీ రూ.40కి ప్రజలకు సరఫరా చేస్తామని చెప్పిన మాటలు ఆచరణలో మాత్రం నోచుకోలేదు. సబ్సిడీ ఉల్లి కోసం చల్లపల్లి రైతు బజారుకు వెళ్లిన వినియోగదారులకు... రేపు వస్తాయనే బోర్డు చూసి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
మండిపడుతున్న కూరగాయలు, ఉల్లిపాయ ధరలు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని... ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో సుమారు 2లక్షల 50వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరందరికి చల్లపల్లిలో ఉన్న రైతు బజారు ఒక్కటే దిక్కు. కాయగూరలు గతంలో వారాంతపు సంతల ద్వారా అమ్మకాలు జరిపేవారు. కరోనా కారణంగా సంతలు కూడా నిర్వహించడం లేదు. ఒక పక్క కూరగాయల ధరలు మండిపడుతుంటే మరో పక్క ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
కిలో ఉల్లి కూడా మార్కెట్కు చేరుకోలేదు