కృష్ణా జిల్లా మైలవరంలో బుడమేరు వంతెన పక్కన ఉన్న నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వుతున్నారంటూ... స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకుండా జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో వాగులో మట్టిని తీస్తున్నారు. ఇదే అంశంపై తహసీల్దార్, పంచాయతీ అధికారులకు స్థానికులు పిర్యాదు చేశారు.
మట్టిని తోలడం వల్ల పక్కన నిర్మాణం జరుపుకుంటున్న రహదారిని సైతం ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిలో నిర్మాణం చేయడమే కాకుండా అనుమతులు లేకుండా మట్టి తవ్వి, వాగు స్థలం అక్రమిస్తున్న స్థల యజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.