ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు - Increase land registration value in the andhrapradesh capital

అమరావతిలో భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచేందుకు సీఆర్​డీఏ ఆమోదం తెలిపింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త ధరల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరిపేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

రాజధానిలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు

By

Published : Jul 23, 2019, 5:42 AM IST

Updated : Jul 23, 2019, 1:56 PM IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరిగింది. దీనికి ఆమోదం లభించింది. రాజధానిలోని 29 గ్రామాల్లో భూముల ధరల పెంపు ప్రతిపాదనల దస్త్రానికి సీఆర్​డీఏ ఆమోదం తెలిపింది. దీంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త ధరల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం ధర రూ.వెయ్యి ఉండగా... రూ.2,500కు పెంచారు. రూ.2,500 ఉన్నచోట రూ.5 వేల వరకు పెరిగాయి. రాజధానియేతర ప్రాంతాల్లో ఈ స్థాయిలో పెంచలేదు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా సగటున రూ.200 నుంచి రూ.2 వేలకు మించి పెంపుదల లేదు.

Last Updated : Jul 23, 2019, 1:56 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details