ఇదీ చూడండి:
జగ్గయ్యపేటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా - latest news of panchayathi elections
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మండలంలోని తొర్రగుంటపాలెం, ఆటోనగర్ గ్రామాలు జగ్గయ్యపేట మున్సిపాలిటీలో విలీనం కావటం, తిరుమలగిరి, రామచంద్రునిపేట గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందటంతో ఎన్నికలు వాయిదా వేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు మండల ఎన్నికల అధికారి దేవాదాసు తెలిపారు.
జగ్గయ్యపేట మండలంలో ఎన్నికలు వాయిదా వేసిన జిల్లా కలెక్టర్