మూడు రాజధానుల అంశం తమ ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికలకు రిఫరెండం కాదని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వైకాపా అన్ని చోట్లా విజయం సాధిస్తుందని ఆయన వెల్లడించారు. సచివాలయం వద్ద మాట్లాడిన ఆయన.. చంద్రబాబులా తమ ప్రభుత్వం పూటకో మాట చెప్పదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లాగానే ఇవి కూడా ఉంటాయని అవంతి అభిప్రాయపడ్డారు. రాజధానుల అంశం అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపదని అభిప్రాయపడ్డారు.
స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకమని వివరించారు.
రాజధాని రైతులకు మేలు చేసేలా సీఎం నిర్ణయం