తెలంగాణ రాష్ట్రం కోదాడలోని ఓ మద్యం దుకాణం నుంచి... చందర్లపాడు మండలం పెద్దవరం గ్రామానికి మద్యాన్ని తరలిస్తుండగా... పోలీసులు పట్టుకున్నారు. సుమారు 200 మద్యం సీసాలను ఆటోలో తరలిస్తున్నారు. వాటిని నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంలో... ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - కృష్ణాలో తెలంగాణ నుంచి వస్తున్న అక్రమద్యం పట్టివేత న్యూస్
తెలంగాణ సరిహద్దు నుంచి... రాష్ట్రానికి అక్రమంగా మద్యం సరఫరా కొనసాగుతోంది. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు మద్యం తరలిస్తున్న వారిని పట్టుకున్నారు.
![తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5125509-174-5125509-1574257868220.jpg)
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
Last Updated : Nov 20, 2019, 7:53 PM IST