కరోనా వ్యాప్తికి నిలయాలుగా మారుతున్న మద్యం దుకాణాలు తక్షణం మూసివేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ లిక్కర్ మాఫియా కోరలు చాచిందని ఆక్షేపించారు.
ఒక పక్క కరోనా బారినపడి వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో రోజూ ప్రాణాలు కోల్పోతున్నా జగన్ రెడ్డి ధన దాహం తీరడం లేదని మండిపడ్డారు. కరోనా కల్లోలం సృష్టిస్తున్నా... 25 వేల కోట్ల జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మద్యం దుకాణం ముందు మందుబాబులు బారులు తీరిన వీడియోను లోకేశ్ ట్వీట్ చేశారు.