ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెక్ పోస్టులు దాటగలిగారు కానీ..పోలీసులు చెక్ పెట్టేశారు! - corona cases in krishna dst

రాష్ట్రంలో అధికంగా పెరిగిన మద్యం రేట్లు.. తెలంగాణలో మద్యం తక్కువ దరకే వస్తుండటంతో కొందరు ఇదే అదునుగా మద్యం అక్రమ రవాణాకు తెరలేపారు. తెలంగాణ నుంచి విజయవాడకు మద్యం తీసుకొచ్చి అధిక రేట్లకు అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు...70మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

liquor seized in krishna dst vijayawada  buying from Telangana
liquor seized in krishna dst vijayawada buying from Telangana

By

Published : May 11, 2020, 8:07 PM IST

విజయవాడ రెడ్ జోన్ ప్రాంతాల్లో మద్యం అధిక ధరలకు అమ్ముకోవటానికి తెలంగాణ నుంచి ద్విచక్రవాహనంపై మద్యం సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 70 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగర శివారు గొల్లపూడి వై జంక్షన్ సమీపంలో భవానిపురం పోలీసులు తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్దనున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు..

ABOUT THE AUTHOR

...view details