కృష్ణా జిల్లా నూజివీడు మండలం లీలాగర్‌లో తండ్రీకుమారుల మధ్య వివాదం నిండుప్రాణాలు బలి తీసుకుంది. మద్యం తాగొచ్చి రోజూ గొడవ చేస్తున్నాడని కుమారుడిని మందలించాడు తండ్రి. అప్పటికే పూటుగా తాగి ఉన్న తనయుడు వెంకటేశ్వరరావు... నాన్నతో గొడవ పడ్డాడు. తాగిన మైకంలో దగ్గర్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. అతన్ని రక్షించబోయాడు తండ్రి. కుమారుడిని రక్షించలేకపోయాడు... తనూ గాయాలపాలయ్యాడు. అతన్ని నూజివీడు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు.
మద్యం మత్తు తీసింది రెండు నిండు ప్రాణాలు - killed
కృష్ణా జిల్లా నూజివీడు మండలం లీలాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తు తండ్రీకుమారులను బలి తీసుకుంది.
తండ్రి,కొడుకు మరణానికి కారణమైన మద్యం