ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోనెసంచుల్లో మద్యం అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్ - జొన్నలగడ్డ వద్ద మద్యం అక్రమ రవాణా వార్తలు

తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా జొన్నలగడ్డ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 294 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేశారు.

liquor illegal transport in jonnalagadda krishna district
గోనెసంచుల్లో మద్యం అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్

By

Published : Jun 17, 2020, 7:44 PM IST

పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా మద్యం అక్రమ రవాణా ఆగడంలేదు. మద్యం రవాణా చేసేందుకు వ్యక్తులు కొత్తదారులు వెతుకుతున్నారు. వాహనాల ద్వారా తరలిస్తే పట్టుబడుతారని.. గోనెసంచుల్లో వేసుకుని నడుచుకుంటూ తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా జొన్నలగడ్డ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 294 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details