మద్యం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. చేపలు తరలించే ఆక్సిజన్ నీటి ట్యాంకులో మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి రవాణా చేస్తున్న మద్యాన్ని కంచికచర్ల మండలం దొనబండ వద్ద చెక్ పోస్ట్ పోలీసులు పట్టుకున్నారు. నీటి ట్యాంకుల్లో ఉన్న 107 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
చేపలు తరలించే నీటి ట్యాంకుల్లో మద్యం అక్రమ రవాణా - కృష్ణా జిల్లాలో మద్యం అక్రమ రవాణా వార్తలు
మద్యం అక్రమ రవాణాకు పలువురు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కృష్ణా జిల్లా దొనకొండ వద్ద చేపలు తరలించే నీటి ట్యాంకుల్లో తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
చేపలు తరలించే నీటి ట్యాంకుల్లో మద్యం అక్రమ రవాణా