ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా.. 339 సీసాలు స్వాధీనం - కృష్ణా జిల్లాకు మద్యం అక్రమ రవాణా వార్తలు

కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 339 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

liquor illegal transport from telangana to nandigama krishna distrcit
మద్యం అక్రమ రవాణా

By

Published : Jul 9, 2020, 11:15 AM IST

తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద ఆటోలో తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 339 మద్యం బాటిళ్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు నందిగామ సీఐ కనకరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details