ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరంలో భారీగా మద్యం సీజ్ - latest news of liquor in krishan dst

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతో కొందరు వ్యక్తులు తెలంగాణ నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇలాంటి వారిపైనే పోలీసులు గట్టి నిఘాపెట్టారు. కృష్ణా జిల్లా మైలవరం జి.కొండూరు మండల పరిధిలో వారంరోజులు పోలీసులు తనిఖీలు నిర్వహించి మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.

liquer seized in krishna dst mylavaram
liquer seized in krishna dst mylavaram

By

Published : May 16, 2020, 4:19 PM IST

తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం కొనుగోలు చేసి రాష్ట్రానికి తరలిస్తున్న అక్రమార్కులపై పోలీసులు నిఘాపెట్టారు. కృష్ణా జిల్లా మైలవరం పరిధిలో వారంరోజులుగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామాల నుంచి అక్రమంగా తరలిస్తున్న వందలాది మద్యం బాటిళ్లను, రవాణా చేస్తున్న కార్లను, ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. 30 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details