ప్రభుత్వ మద్యం షాపులో సరుకు ఏమైంది? ఆ నలుగురు ఉద్యోగులు పనేనా? - Theft at a government liquor store

ప్రభుత్వ మద్యం దుకాణం
15:05 September 23
liquor Stolen
ప్రభుత్వ మద్యం దుకాణంలోని సరుకును.. మాయం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ గౌరీశంకరపురంలోని ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణంలో ఐఎంఎల్ డిపో ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో షాపులోని రూ.9.86 లక్షల మద్యం సీసాలు మాయమైనట్లు గుర్తించామని ఎక్సైజ్ సీఐ నాగవాణి తెలిపారు. ఈ ఘటనలో దుకాణ సూపర్‌వైజర్‌తో సహా నలుగురు ఉద్యోగులను తొలగించినట్లు సీఐ చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Last Updated : Sep 23, 2021, 4:04 PM IST