కరోనా విపత్కర సమయంలో సాయం చేయడానికి అయినవాళ్లే ముందుకురాని పరిస్థితుల్లో.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. కృష్ణా జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ పుట్టిగుంటు సతీష్.. లయన్స్‌క్లబ్ సభ్యులతోపాటు తనకున్న హెల్త్‌ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.కోటి వరకు సాయం చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి కోసం రెడ్‌క్రాస్ వైద్యులతో చర్చించి.. వారు నిర్దేశించిన ఔషదాలను కిట్‌ల రూపంలో తయారు చేయించి బాధితులకు పంపిణీ చేశారు.
కరోనా బాధితులకు ఔషధాలు పంపిణీ.. - కృష్ణా జిల్లాలో లయన్స్ క్లబ్ వార్తలు
కరోనా పేరు వింటేనే హడలిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాధితులకు సహాయం అందించేందుకు తామున్నామంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని లయన్స్ క్లబ్ సభ్యులు తమకున్న హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఆకలితో అలమటిస్తున్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి కిట్‌ల రూపంలో ఔషధాలను పంపిణీ చేశారు.
Lions Club Governor sathish distributed medicines to corona victims
జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ, ఇతర విభాగాల వారికి శానిటైజర్లు, మాస్కులు, ఫేస్‌షీల్డులు, పల్స్ ఆక్సిమీటర్లుతోపాటు విటమిన్-డి సొల్యూషన్ తదితరాలను ఫౌండేషన్ ద్వారా అందజేశారు.లయన్స్‌క్లబ్ ద్వారా 3,200 మందికి టీకా వేయించారు. 120 కుటుంబాలకు లయన్స్ క్లబ్ ద్వారా ఆరోగ్య బీమా చేయించారు.
ఇదీ చదవండి