కృష్ణా జిల్లాలో పోలీసులకు ప్రత్యేక లైసెన్స్ మేళా నిర్వహించారు.ఈ మేళాకు పోలీసులు భారీగా హజరైయ్యారు.పోలీసు శాఖలో మూడు సబ్ డివిజన్లలో దాదాపు700పోలీసులకు డ్రైవింగ్ లైసెన్సులు లేవని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు గుర్తించారు.వీరందరికి ఒకే సారి లైసెన్స్ మంజూరు చేయించేందుకు,రవాణా శాఖ అధికార్లతో సంప్రదించి ప్రత్యేక లైసెన్స్ మేళాను ఏర్పాటు చేయించారు.రవాణ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రజలను ట్రాఫిక్ చట్టాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉన్న పోలీసులే చట్టానికి అతీతంగా వ్యవహరించడం సరికాదన్నారు.ఎస్పీ తీసుకున్న నిర్ణయం అభినందనీయంమంటూ ప్రశంసించారు.
పోలీసులు చట్టానికి అతీతులు కాదు: మంత్రి పేర్ని - police driving license mela recent
ప్రజలు ట్రాఫిక్ చట్టాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని, పోలీసులు చట్టానికి అతీతులు ఏమి కాదని మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. పోలీసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ లైసెన్సు మేళాను ఆయన ప్రారంభించారు.
![పోలీసులు చట్టానికి అతీతులు కాదు: మంత్రి పేర్ని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4426428-727-4426428-1568364124801.jpg)
డ్రైవింగ్ లైసెన్సు మేళాలో రాష్ట్ర మంత్రి