అత్యవసర సమయంలో పరిశ్రమలోకి వెళ్లేందుకు అనుమతి కావాలని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పరిశ్రమలో ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్లాల్సిన అవసరముందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఆ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై దాఖలైన పిటిషన్పై ఇటీవలే విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం... పరిశ్రమ ప్రాంగణం పూర్తిగా సీజ్ చేయమని ఆదేశించింది.
తెరిచేందుకు అనుమతివ్వండి... హైకోర్టును ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్ - lg polymers in visakhapatnam latest news
పరిశ్రమ తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని... ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సూచన మేరకు హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేసింది.
కోర్టును ఆశ్రయించిన ఎల్జీపాలిమర్స్