గవర్నర్‌పేట మహంతి చేపల మార్కెట్లో తూనికలు, కొలతలశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రతీ దుకాణంలోని కొలతల యంత్రాలను.. తూనికల విధానాలను పరిశీలించారు. లీగల్ మెట్రాలజీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన షాపులపై పద్నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ దాడులలో ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, శ్రీకాంత్, సులేమాన్, ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
మహంతి చేపల మార్కెట్లో తూనికలు, కొలతలశాఖ అధికారుల తనిఖీలు - gavarnorpeta latest news
విజయవాడ గవర్నర్‌పేట మహంతి చేపల మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్న షాపులపై కేసులు నమోదు చేశారు.
తూనికలు, కొలతలశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు