ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు మద్దతివ్వకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: సీపీఐ రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ తాజా వార్తలు

విజయవాడ దాసరి భవన్​లో వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు సమావేశమయ్యారు. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ పై చర్చించిన నేతలు వ్యవసాయ బిల్లులపై కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ, విద్యుత్ 2020 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

left-party-leaders-and-public-unions-meeting
భారత్ బంద్​పై వామపక్షాల సమావేశం

By

Published : Dec 6, 2020, 2:29 PM IST

రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ పై పది వామపక్ష పార్టీలు విజయవాడ దాసరి భవన్​లో సమావేశం నిర్వహించాయి. ఈ చర్చలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తో‌పాటు వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. డిసెంబరు 8న భారత్ బంద్ రోజు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల‌ విషయంలో మొండిగా వ్యవహరిస్తోందని.. కార్పొరేట్ సంస్థల కోసం ఏకపక్షంగా బిల్లులు తెచ్చిందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలు చేతిలో పెట్టాలని మోదీ సర్కారు భావిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వైకాపాతో సహా అన్ని పార్టీలు బంద్​ కు మద్దతు ఇవ్వాలని కోరారు. లేదంటే రైతు వ్యతిరేక పార్టీలుగా‌ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఇప్పటికే టీఆర్​ఎస్​తో‌ సహా అనేక పార్టీలు బంద్​కు మద్దతు ఇచ్చాయన్నారు. దేశంలోని అన్ని సంఘాలు ఈ బంద్ లో పాల్గొని రైతులకు అండగా ఉండాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details