రాజధాని అమరావతిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని భాజపాతో కలిసి డ్రామాలు ఆడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు.
కరోనా తీవ్రంగా ఉంటే దాన్ని పట్టించుకోకుండా రాజధాని అంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే 1500 మంది చనిపోయారని ఆరోగ్యశ్రీ అంటే చికిత్స చేయడం లేదన్నారు. అమరావతిని కొనసాగించాలి, ఉత్తరాంద్ర, రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మధు డిమాండ్ చేశారు.