మార్చి 5వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తూ విజయవాడలో వామపక్ష పార్టీల నేతలు గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో ప్రాణ త్యాగాలు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించారని అన్నారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా భాజపా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే కార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మార్చి 5న జరిగే ఈ బంద్‌లో అన్ని పార్టీలు ముందుకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.
రాష్ట్రవ్యాప్త బంద్‌కు వామపక్షాల పిలుపు - విశాఖ ఉక్కు పరిశ్రమ
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి అయిదో తేదీన రాష్ట్రవ్యాప్త బంద్‌కు వామపక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి కలిగేలా భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆరోపించారు.
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
Last Updated : Mar 3, 2021, 8:25 PM IST