ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 28, 2021, 1:47 PM IST

ETV Bharat / state

పన్నుల పెంపును నిరసిస్తూ విజయవాడలో వామపక్షాల ర్యాలీ

పన్నులు పెంపును నిరసిస్తూ విజయవాడలో వామపక్ష నేతలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆస్తి, చెత్త పన్నును పెంచుతూ తెచ్చిన 196, 197, 198 జీవోలను వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు.

Left leaders rally on tax hikes  in Vijayawada
పన్నులు పెంపును నిరసిస్తూ విజయవాడలో వామపక్ష నేతల ర్యాలీ

ఆస్తి ,చెత్త పన్నుపెంపును నిరసిస్తూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట.. సీపీఐ, సీపీఎం చేస్తున్న ర్యాలీని.. పోలీసులు భగ్నం చేశారు. వామపక్ష నాయకులకు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పన్నుల పెంపు కోసం తెచ్చిన జీఓలను రద్దు కోరుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను అడ్డుకోవటాన్ని ఖండిస్తున్నామని నాయకులు మండిపడ్డారు. కోవిడ్ సమయంలో ప్రజలు అల్లాడుతుంటే.. జగన్, మోదీ కలిసి మరో రకంగా భారాన్ని వేస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశాలకు మీడియాను అనుమతించాలని తెదేపా కార్పొరేటర్లు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముందు నిరసన వ్యక్తంచేశారు. ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉన్న మీడియాను కౌన్సిల్‌ సమావేశాలకు అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు విమర్శించారు. ఆస్తి, చెత్త పన్నును పెంచుతూ తెచ్చిన 196, 197, 198 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ధి కోసం కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించకుండా.. కేవలం పన్ను పెంపు కోసం ఈ సమావేశాలు నిర్వహించడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details