కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో వార్తా సేకరణకు వెళ్లిన పాత్రికేయులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. తాము విలేకరులమని చెప్తున్నా పట్టించుకోకుండా కొట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ హనుమాన్ జంక్షన్‌లో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందంచారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించవద్దన్నారు.
పాత్రికేయులపై విరిగిన లాఠీ.. స్పందించిన మంత్రి పేర్ని
ప్రజా సమస్యలపై గళం విప్పుతూ... నిస్వార్ధంగా, నిర్భయంగా, కరోనా భయాన్ని పెన్ను చాటున అదిమిపట్టి మరీ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్న పాత్రికేయులపై లాఠీ దెబ్బ పడింది. తాము విలేకరులమని ఎంత చెప్పినా పట్టించుకోకుండా... వార్తా సేకరణకు వెళ్లిన వారిని వాతలు పడేలా కొట్టారు పోలీసులు.
వార్తసేకరణకు వెళ్లిన పాత్రికేయులపై పోలీసు దెబ్బలు