ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టి జారదు.. రాయి పడదు - Vijayawada Kanaka durga temple

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు తరచూ విరిగిపడకుండా..కొండ చుట్టూ ఇనుప కంచెతో పాటు హైడ్రోసీడింగ్‌ పద్ధతిలో విత్తనాలు చల్లుతున్నారు. కొండపై ఖాళీగా ఉండే ప్రాంతమంతా గడ్డి, చిన్నచిన్న పొదలు పెరిగి రాళ్లు, మట్టి జారిపడకుండా ఉండేలా ప్రణాళిక రచించారు.

ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి

By

Published : Sep 14, 2021, 7:32 AM IST

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొండచరియలు తరచూ విరిగిపడుతుంటాయి. వర్షాకాలం ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతాయి. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్‌ రోడ్డులో కొండ చుట్టూ ఇనుప కంచెతో పాటు హైడ్రోసీడింగ్‌ పద్ధతిలో విత్తనాలు చల్లుతున్నారు. కొండపై ఖాళీగా ఉండే ప్రాంతమంతా గడ్డి, చిన్నచిన్న పొదలు పెరిగి రాళ్లు, మట్టి జారిపడకుండా ఉండేలా ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా కొండపై రసాయనాలతో కలిపి విత్తనాలు చల్లడంతో ఇలా ఆకుపచ్చగా కనిపిస్తోంది.

ప్రయోగాత్మకంగా ఇలా గడ్డి విత్తనాలు చల్లడంతో వారం పది రోజుల్లో గడ్డి పెరిగి అందంగా కనిపిస్తుందని, ప్రమాద నివారణ, తీవ్రత తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:కోర్టు కేసులపై 'మనుపాత్ర' పేరుతో ప్రత్యేక యాప్: రజత్ భార్గవ

ABOUT THE AUTHOR

...view details