కృష్ణాజిల్లా పామర్రుమండలం చెన్నువానిపురంలో సీఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి చేశాడు. గ్రామస్తులతో చంద్రశేఖర్‌కు గతకొంత కాలంగా భూవివాదాలు జరుగుతున్నాయి. ఈరోజు చంద్రశేఖర్ ఇంటి పని నిమిత్తమై కంకరు చేరవేస్తుండగా గ్రామానికి చెందిన బొడ్డు బాబూరావు(65), దోనే అప్పలస్వామి(63), తుమ్మల శ్రీరాములు(63) స్థలం విషయమై వాగ్వాదానికి దిగారు. చంద్రశేఖర్ తీవ్ర ఉద్రేకంతో వారిపై కత్తితో దాడి చేశాడు.
సరిహద్దు వివాదం...ముగ్గురిపై సీఆర్పీఎఫ్ ఉద్యోగి కత్తితో దాడి - crpf officers attack on three man at pamarru
కృష్ణాజిల్లా పామర్రు మండలం చెన్నువానిపురంలో సరిహద్దు వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో ముగ్గురిపై సీఆర్పీఎఫ్ ఉద్యోగి బొడ్డు చంద్రశేఖర్ కత్తితో దాడి చేశారు.

ముగ్గురిపై సీఆర్పీఎఫ్ ఉద్యోగి కత్తితో దాడి
చెన్నువానిపురంలో సరిహద్దు వివాదం
బాధితులను హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ గ్రామస్థులు మచిలీపట్నం విజయవాడ హైవేపై చెన్నువానిపురం వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు చంద్రశేఖర్‌తో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకెెళ్తుంటే గ్రామస్థులు అడ్డుకున్నారు.
చెన్నువానిపురంలో సరిహద్దు వివాదం
ఇదీ చదవండి: ఈనెల 8న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా
Last Updated : Oct 5, 2020, 3:54 PM IST