రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల భూముల విక్రయానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అభివృద్ధి చేసిన భూముల విక్రయానికి బిల్డ్ ఏపీ మిషన్ కార్యాచరణ చేపట్టింది. వేలం ద్వారా భూముల విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో విశాఖ, గుంటూరులో కలిపి 9 చోట్ల భూముల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించగా... విశాఖలో 6, గుంటూరులో 3 ప్రాంతాల్లోని భూములను వేలం వేయనున్నట్లు బిల్డ్ ఏపీ మిషన్ తెలిపింది.
వేలం ద్వారా భూముల విక్రయానికి ప్రభుత్వం కార్యాచరణ
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్లలో భూముల విక్రయానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. వేలం ద్వారా భూముల విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వేలం ద్వారా భూముల విక్రయానికి ప్రభుత్వ కార్యాచరణ
ఈ నెల 29న తొమ్మిది ప్రాంతాల్లోని భూములకు ఈ-వేలం నిర్వహించనున్నారు. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని... నవరత్నాలు, నాడు-నేడు వంటి ప్రభుత్వ పథకాలకు నిధులు వెచ్చించనున్నట్లు తెలిపింది. భూముల వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని బిల్డ్ ఏపీ మిషన్ ప్రకటించింది. వేలం వేయనున్న 9 భూములకు మొత్తం రిజర్వ్ ధర రూ.208.62 కోట్లని వివరించింది.
ఇదీ చదవండి:
'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'
Last Updated : May 13, 2020, 9:18 PM IST