కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో శ్రీ శోభనాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. స్వామివారికి మాఘమాసం రథసప్తమి కల్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చక స్వాములు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వామి వారి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సహాయంతో అనాదిగా కొనసాగుతున్న తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈనెల 31 రాత్రి శ్రీ స్వామి వార్ల గరుడోత్సవం... వచ్చేనెల 1న శ్రీ స్వామివార్లకు, శ్రీ గోదా అమ్మవార్లకు దివ్య కల్యాణం... 2వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాంప్రదాయబద్ధంగా స్వామివార్ల రథోత్సవం కొనసాగుతుందన్నారు. ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 2వరకూ జరిగే స్వామివార్ల తిరునాళ్లకు సంబంధించి కార్యనిర్వహణ అధికారి సుబ్రమణ్యం పర్యవేక్షణలో సకల సన్నాహాలను సిద్ధం చేశారు.
ఆగిరిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లు ప్రారంభం - undefined
కృష్ణా జిల్లా ఆగిరిపల్లి శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 2వరకూ తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు.
ఆగిరిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లు ప్రారంభం
ఇదీ చూడండి: ఘనంగా వేమాలశెట్టి తిరునాళ్లు: పోటెత్తిన భక్తులు