తెదేపా అధినేత చంద్రబాబుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. లక్ష్మిపార్వతి చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని నిర్థారించిన కోర్టు తుది తీర్పు ప్రకటించింది.
2005లో పిటిషన్ దాఖలు..
ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాస్తులు సంపాదించుకున్నారని లక్ష్మిపార్వతి 2005లో అనిశా కోర్టులో పిటిషన్ వేశారు. ఉమ్మడి హైకోర్టు స్టే విధించడంతో చాలా కాలం విచారణ ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవలే స్టే తొలగిపోవడంతో అనిశా న్యాయస్థానం విచారణ చేపట్టింది.