విజయవాడ సత్యనారాయణ పురంలో కార్తీక దీపోత్సవాన్ని... విశ్వహిందూ పరిషత్, శత సహస్ర లక్ష దీపార్చన సేవా మండలి సంయుక్తంగా నిర్వహించాయి. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రానికి చెందిన శివ స్వామీజీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
కరోనా నుంచి ప్రజలు కోలుకోవాలని సంకల్పిస్తూ... ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే నూతన సంవత్సరంలో చెడు తొలిగిపోయి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన నృత్యప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది.