కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గోపూజ, తీర్థపు బిందె, లక్ష పుష్పార్చన, సహస్ర దీపోత్సవాలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సెలవురోజు కావటం వల్ల భక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి లీలా కుమార్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
మోపిదేవి ఆలయంలో లక్ష బిల్వార్చన - కృష్ణా జిల్లా వార్తలు
మోపిదేవి మండల కేంద్రంలోని శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. సెలవురోజు కావటం వల్ల భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
లక్ష బిల్వార్చన