ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్పత్రిలో మీవాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోవాలా..? కొంచెం ఖర్చవుతుంది!

మీ బంధువలు ఎవరైనా ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్నారా ? వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే కొంచెం ఖర్చవుతుంది అంటూ.. ఓ మహిళ నగదు వసూలు చేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. కరోనా బాధితుల ఆరాటాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తోంది.

By

Published : Jul 30, 2020, 2:47 AM IST

lady hulchal
lady hulchal

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ పీపీఈ సూట్ ధరించి మరీ మోసానికి పాల్పడుతోంది. మహిళ బయటకు వెళ్తుండగా.. అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మహిళను నిలువరించారు. తాను డాక్టర్​నని.. పేరు శైలజ అని బుకాయించింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

గత కొద్ది రోజులుగా పీపీఈ సూట్ ధరించి, మెడలో స్టెతస్కోప్​తో లోపలికి వెళ్లి.. కొద్ది సేపటి తర్వాత తిరిగి వెళ్లిపోతుంది. గతంలో సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేసినా పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగి బంధువుల నుంచి నగదు తీసుకుని లోనికివెళ్లి.. వారికి కావాల్సినవి ఇవ్వటం, అదేవిధంగా వాళ్లు ఎలా ఉన్నారో బంధువులకు చెప్పడం లాంటి పనులు చేస్తోందని పోలీసులు వివరించారు. అదుపులోకి తీసుకున్న మహిళపై గతంలో కేసులున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది. మహిళతో సహా ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 10,093 కేసులు

ABOUT THE AUTHOR

...view details