ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సోకిందనే భయంతో శానిటైజర్​ తాగిన యువతి - విస్సన్నపేటలో శానిటైజర్​ తాగిన మహిళ

ఆగని దగ్గుతో వేగలేక కరోనా మహమ్మారి సోకిందనే అనుమానంతో ఓ యువతి శానిటైజర్​ తాగింది. ప్రథమ చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

lady drunk sanitizer because of corona fear
శానిటైజర్​ తాగిన విస్సన్నపేటకు చెందిన మహిళ

By

Published : Oct 20, 2020, 11:27 PM IST

నూజివీడు డివిజన్​ విస్సన్నపేట మండలం ముత్రాసుపాలెం గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆగకుండా దగ్గు రావడం వల్ల కరోనా మహమ్మారి సోకిందనే భయంతో శానిటైజర్​ మింగేసింది. ఈమె విసన్నపేటలో టైలరింగ్​ చేస్తూ జీవనం సాగిస్తుంది. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి కావడం వల్ల 108 అంబులెన్స్​లో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఏరియా ఆసుపత్రి వైద్య నిపుణులు రవి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details