విజయవాడ నగర శివారు ప్రాంతాలలో ఇటీవల తెరిచిన మద్యం షాపులను వెంటనే మూసివేయాలని కోరుతూ పాయికాపురం రాధా నగర్ లో స్ధానిక మహిళలు, ఐద్వా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నగర శివారు ప్రాంతాలలో లాక్ డౌన్ అనంతరం ఇటీవల తెరిచిన ప్రభుత్వ వైన్ షాపుల వలన తామూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కరోనా కారణంగా తామంతా ఆర్దిక ఇబ్బందులలో ఉంటే వైన్‌షాపులు తెరవటంతో తమ భర్తలు మద్యం తాగేందుకుఇళ్ళలోని సామానులు అమ్ముకొని.. తాగి గొడవలు పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం షాపులు మూసివేయాలని మహిళల ఆందోళన - women protest news in Vijayawada
మందు కోసం ఇళ్లలోని సామాన్లు అమ్ముకుని తాగి గొడవలు పడుతున్నారంటూ విజయవాడ నగర శివారు పాయికాపురంలో మహిళలు నిరసన చేశారు. వెంటనే మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ చేశారు.
ladies protest in Krishna dst Vijayawada about closing of wine shops